×
يوسفఆయత్ 6

అల్-ముఖ్తసర్

وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأْوِيلِ ٱلْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُۥ عَلَيْكَ وَعَلَىٰٓ ءَالِ يَعْقُوبَ كَمَآ أَتَمَّهَا عَلَىٰٓ أَبَوَيْكَ مِن قَبْلُ إِبْرَٰهِيمَ وَإِسْحَـٰقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌ ﴿٦﴾

మరియు ఏ విధంగా నైతే నీవు ఈ కలను చూశావో ఓ యూసుఫ్ నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు.మరియు నీకు కలల తాత్పర్యమును నేర్పుతాడు,మరియు ఆయన దైవదౌత్యము ద్వారా నీపై తన అనుగ్రహమును సంపూర్ణం చేస్తాడు. ఏవిధంగానైతే ఆయన నీ కన్నా మునుపు నీ తాతముత్తాతలైన ఇబ్రాహీమ్,ఇస్ హాఖ్ లపై తన అనుగ్రహమును సంపూర్ణం చేశాడో ఆవిధంగా.నిశ్చయంగా నీ ప్రభువు తన సృష్టి గురించి బాగా తెలిసినవాడు,తన కార్య నిర్వహణలో వివేకవంతుడు.