×
يوسفఆయత్ 94

అల్-ముఖ్తసర్

وَلَمَّا فَصَلَتِ ٱلْعِيرُ قَالَ أَبُوهُمْ إِنِّى لَأَجِدُ رِيحَ يُوسُفَ ۖ لَوْلَآ أَن تُفَنِّدُونِ ﴿٩٤﴾

మరియు బిడారం మిసర్ నుండి బయలుదేరి అది జనసంచారము నుండి దూరమైనప్పుడు యాఖూబ్ అలైహిస్సలాం తన కుమారులతో మరియు తన చుట్టుప్రక్కల ఉన్న వారితో ఇలా పలికారు : ఒక వేళ మీరు నాకు జ్ఞానం లేదని మరియు నాకు మతి భ్రమించిందని మీ మాటల్లో ఇతడు మతి భ్రమించిన ముసలివాడు,ఇతనికి తెలియనివి మాట్లాడుతున్నాడు అని నిందించకుండా ఉంటే నిశ్చయంగా నాకు యూసుఫ్ యొక్క వాసన అనుభూతి కలుగుతుంది.