×
إبراهيمఆయత్ 11

అల్-ముఖ్తసర్

قَالَتْ لَهُمْ رُسُلُهُمْ إِن نَّحْنُ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ وَلَـٰكِنَّ ٱللَّهَ يَمُنُّ عَلَىٰ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ ۖ وَمَا كَانَ لَنَآ أَن نَّأْتِيَكُم بِسُلْطَـٰنٍ إِلَّا بِإِذْنِ ٱللَّهِ ۚ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ ﴿١١﴾

వారి ప్రవక్తలు వారిని ఖండిస్తూ ఇలా పలికారు : మేము మీలాంటి మానవులము మాత్రమే. అయితే మేము ఈ విషయంలో మీకు పోలి ఉండటమును నిరాకరించము. కాని ఈ పోలి ఉండటంతో ప్రతి విషయంలో పోలి ఉండటం జరగదు. అల్లాహ్ తన దాసుల్లోంచి ఆయన ఎవరిని తలచుకుంటే వారిని ప్రత్యేక అనుగ్రహము ద్వారా అనుగ్రహిస్తాడు. మరియు వారిని ప్రవక్తలుగా ఎంచుకుని ప్రజల వద్దకు పంపిస్తాడు. మరియు అల్లాహ్ ఇచ్ఛ లేకుండా మేము మీరు కోరిన ప్రతీ వాదనను మీ వద్దకు తీసుకుని రావటం మాకు సరి కాదు. వాటిని తీసుకుని రావటం మా ఆధీనంలో లేదు. కాని అల్లాహ్ ఒక్కడే దాని సామర్ధ్యం కలవాడు. మరియు విశ్వాసపరులు తమ వ్యవహారాలన్నింటిలో అల్లాహ్ ఒక్కడిపై నమ్మకమును కలిగి ఉంటారు.