×
النحلఆయత్ 112

అల్-ముఖ్తసర్

وَضَرَبَ ٱللَّهُ مَثَلًا قَرْيَةً كَانَتْ ءَامِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ ٱللَّهِ فَأَذَٰقَهَا ٱللَّهُ لِبَاسَ ٱلْجُوعِ وَٱلْخَوْفِ بِمَا كَانُوا۟ يَصْنَعُونَ ﴿١١٢﴾

మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానమిచ్చాడు.అది మక్కా నగరం.అది ఎంతో ప్రశాంతతో కూడుకుని ఉండేది,అక్కడి వాసులు భయాందోళనలకు లోనయ్యేవారు కాదు. అది స్థిరంగా ఉన్నది దాని చుట్టుప్రక్కల ప్రాంతముల ప్రజలు మట్టుపెట్టబడేవారు. దానికి ఆహారోపాధి ప్రతి ప్రాంతము నుండి శుభప్రధంగా,సులభంగా వచ్చేది. అప్పుడు అక్కడి వాసులు అల్లాహ్ తమపై అనుగ్రహించిన అనుగ్రహాలను తిరస్కరించారు,ఆయనకు వారు కృతజ్ఞతలు తెలుపుకోలేదు. అయితే అల్లాహ్ వారికి ఆకలి ద్వారా,తీవ్రమైన భయాందోళనల ద్వారా వారి శరీరములపై భయము,బలహీనత బహిర్గతం అవటానికి ప్రతిఫలాన్ని ప్రసాధించాడు. చివరికి అవి (భయం, ఆకలి) వారు పాల్పడిన అవిశ్వాసము,తిరస్కారము కారణం వలన వారికి వస్త్రములుగా అయిపోయినవి.