అల్-ముఖ్తసర్
وَسَخَّرَ لَكُمُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ ۖ وَٱلنُّجُومُ مُسَخَّرَٰتٌۢ بِأَمْرِهِۦٓ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ﴿١٢﴾
మరియు అల్లాహ్ రాత్రిని మీరు అందులో విరామం తీసుకోవటానికి,విశ్రాంతి తీసుకోవటానికి,పగలును మీ జీవన సామగ్రిని అందులో సమకూర్చుకోవటానికి మీ కొరకు నియంత్రణలో పెట్టాడు. మరియు ఆయన సూర్యుడిని మీ కొరకు నియంత్రించి దానిని కాంతివంతంగా చేశాడు,చంద్రుడిని నియంత్రించి వెలుగుగా చేశాడు. మరియు నక్షత్రాలు ఆయన విధి ఆదేశము ద్వారా మీ కొరకు నియంత్రించబడ్డాయి. వాటి ద్వారానే మీరు భూమియొక్క,సముద్రము యొక్క చీకట్లలో మార్గమును పొందుతున్నారు,సమయములను,ఇతర వాటిని మీరు తెలుసుకో గలుగుతున్నారు. నిశ్చయంగా వీటన్నింటిని నియంత్రించటంలో తమ బుద్దిని వినియోగించే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై స్పష్టమైన సూచనలు కలవు. వారే వాటి నుండి విజ్ఞతను పొందుతారు.