×
النحلఆయత్ 14

అల్-ముఖ్తసర్

وَهُوَ ٱلَّذِى سَخَّرَ ٱلْبَحْرَ لِتَأْكُلُوا۟ مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا۟ مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى ٱلْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿١٤﴾

పరిశుద్ధుడైన ఆయనే సముద్రమును మీకు వశపరచాడు. అప్పుడే దానిపై ప్రయాణము,అందులో ఉన్న వాటిని వెలికి తీయటం మీకు సంభవమైనది; మీరు వేటాడే చేపల మెత్తని,తాజా మాంసం మీరు తినటానికి,దాని నుండి మీరు అలంకరణకు మీరు తొడిగే,మీ స్త్రీలు తొడిగే ముత్యాల్లాంటి వాటిని మీరు వెలికి తీయటానికి. మరియు నీవు సముద్రపు అలలను చీల్చుకుంటూ వెళ్ళే ఓడలను చూస్తావు. మీరు ఈ ఓడలపై అల్లాహ్ అనుగ్రహముతో లభించే వ్యాపార లాభాలను ఆశిస్తూ,అల్లాహ్ మీకు ప్రసాధించిన అనుగ్రహాలకు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటమును ఆశిస్తూ ,ఆరాధనను ఆయన ఒక్కడికే ప్రత్యేకిస్తూ ప్రయాణం చేస్తారు.