అల్-ముఖ్తసర్
وَٱللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَـٰلًا وَجَعَلَ لَكُم مِّنَ ٱلْجِبَالِ أَكْنَـٰنًا وَجَعَلَ لَكُمْ سَرَٰبِيلَ تَقِيكُمُ ٱلْحَرَّ وَسَرَٰبِيلَ تَقِيكُم بَأْسَكُمْ ۚ كَذَٰلِكَ يُتِمُّ نِعْمَتَهُۥ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ ﴿٨١﴾
మరియు అల్లాహ్ చెట్లను,భవనాలను మీ కొరకు తయారు చేశాడు. మీరు వాటి ద్వారా ఎండ నుంచి నీడను పొందుతున్నారు. మరియు ఆయన పర్వతాల్లో సొరంగాలను,లోయలను,గుహలను తయారు చేశాడు. వాటిలో మీరు చలి నుండి,ఎండ నుండి,శతృవుల నుండి రక్షణ పొందుతున్నారు. మరియు ఆయన మీ కొరకు పత్తి నుండి చొక్కాలను (అంగిలను),వస్త్రాలను తయారు చేశాడు. అవి మీ నుండి ఎండను,చలిని నిర్మూలిస్తాయి. మరియు ఆయన మీ కొరకు యుద్ధంలో మిమ్మల్ని ఒకరినొకరు రక్షించుకునే కవచాలను తయారు చేశాడు. ఆయుధాలు మీ శరీరములను ఛేదించలేవు. అల్లాహ్ మీపై మునుపటి అనుగ్రహములను అనుగ్రహించినట్లే మీపై ఆయన తన అనుగ్రహాలను మీరు ఆయన ఒక్కడినే విధేయత చూపుతారని,ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించరని ఆశిస్తూ పరిపూర్ణం చేస్తాడు.