అల్-ముఖ్తసర్
وَنُنَزِّلُ مِنَ ٱلْقُرْءَانِ مَا هُوَ شِفَآءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ۙ وَلَا يَزِيدُ ٱلظَّـٰلِمِينَ إِلَّا خَسَارًا ﴿٨٢﴾
మేము అవతరింపజేస్తున్నటువంటి ఈ ఖుర్ఆన్ అజ్ఞానము,అవిశ్వాసము,సందేహము నుండి హృదయముల కొరకు స్వస్థత కలది, దాన్ని చదివి ఊదినప్పుడు శరీరముల కొరకు స్వస్థత కలది, దాని ప్రకారం ఆచరించే విశ్వాసపరుల కొరకు కారుణ్యము కలది. ఈ ఖుర్ఆన్ అవిశ్వాసపరుల కొరకు వినాశనమును మాత్రమే అధికం చేస్తుంది. ఎందుకంటే దాన్ని వింటే అది వారికి ఆగ్రహమును కలిగిస్తుంది, దాని నుండి తిరస్కారమును,విముఖతను వారికి అధికం చేస్తుంది.