×
البقرةఆయత్ 134

అల్-ముఖ్తసర్

تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْـَٔلُونَ عَمَّا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١٣٤﴾

ఆ జాతి (ఉమ్మత్) మీకు పూర్వం గతించిన జాతుల్లోంచి ఒక జాతి.వారు ముందే తమ ఆచరణలను చేరవేసుకున్నారు.వారు చేసుకున్న మంచీ,చెడూ వారికోసమే, మీరు చేసుకున్నది మీ కొరకే,వారు చేసుకున్నకర్మల గురించి మీరు ప్రశ్నించబడరు,మీరు చేసుకున్న కర్మల గురించి వారు ప్రశ్నించబడరు,వేరే వారి పాపములకు బదులుగా ఎవరూ శిక్షించబడరు,కాని ప్రతి ఒక్కరు తాము చేసుకున్న దానికి ప్రతి ఫలము పొందుతారు,కావున మీకు పూర్వం గతించిన వారి ఆచరణలు మిమ్మల్నిఅశ్రద్ద వహించేటట్లు చేయకూడదు సుమా.ఎందుకంటే దైవ కారుణ్యం తరువాత ఎవరికీ అతని పుణ్యకార్యము తప్ప ఏదీ లాభం చేకూర్చదు.