×
البقرةఆయత్ 148

అల్-ముఖ్తసర్

وَلِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا ۖ فَٱسْتَبِقُوا۟ ٱلْخَيْرَٰتِ ۚ أَيْنَ مَا تَكُونُوا۟ يَأْتِ بِكُمُ ٱللَّهُ جَمِيعًا ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ ﴿١٤٨﴾

జాతుల్లోంచి ప్రతి జాతికి ఒక దిక్కు ఉన్నది దాని వైపునకే వారు భావన పరంగా లేదా నైతిక పరంగా అభిముఖమవుతుంటారు,దీని వలనే జాతులకి తమ ఖిబ్లా విషయంలో,అల్లాహ్ తమ కొరకు నిర్దేశించిన శాసనాల విషయంలో వ్యతిరేకతలు. వారి దిక్కులు రకరకాలుగా ఉండటం ఒక వేళ అది అల్లాహ్ ఆదేశం అయిన,శాసనమయిన ఎటువంటి నష్టం చేయదు,అయితే ఓవిశ్వాస పరులారా మీరు ఏ పుణ్యకార్యాలు చేయడానికి ఆదేశించబడ్డారో వాటిని చేయడానికి పోటీ పడండి. మీరు ఏ స్థావరంలో ఉన్నా ప్రళయ దినాన మీ కర్మల ప్రతిఫలంను ప్రసాదించడం కొరకు అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారము కలవాడు,మిమ్మల్ని సమీకరించడం,మీకు ప్రతిఫలం ప్రసాదించడం అతన్ని అశక్తుడ్ని చేయదు.