×
البقرةఆయత్ 165

అల్-ముఖ్తసర్

وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ ٱللَّهِ ۖ وَٱلَّذِينَ ءَامَنُوٓا۟ أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ إِذْ يَرَوْنَ ٱلْعَذَابَ أَنَّ ٱلْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلْعَذَابِ ﴿١٦٥﴾

ఈ స్పష్టమైన సూచనలతోపాటు ప్రజల్లోంచి కొందరు అల్లాహ్ ను వదిలి వేరే వారిని ఆరాధ్య దైవాలు చేసుకున్నారు.వారిని అల్లాహ్ కు సరిసమానులుగా పోల్చ సాగారు,వారిని అల్లాహ్ ను ఇష్టపడినట్లు ఇష్టపడ సాగారు,విశ్వాసపరులు వారి(ముష్రిక్కుల) ఈ ఆరాధ్య దైవాల కన్న అల్లాహ్ ను ఎక్కువగా ఇష్టపడుతారు,ఎందుకంటే వారు అల్లాహ్ తో పాటు వేరేవారిని సాటి కల్పించరు,వారు కలిమిలోను,లేమిలోను ఆయనను ఇష్టపడుతారు,కాని వారు (మష్రిక్కులు) తమ ఆరాధ్య దైవాలను కలిమిలోనే ఇష్టపడుతారు,లేమిలో అల్లాహ్ కు తప్ప ఇతరులను వేడుకోరు,ఒక వేళ దుర్మార్గులు తమ బహు దైవారాధన,తమ పాపాల వలన పరలోకంలో శిక్షను చూసుకున్నప్పుడు తమ పరిస్థితిని గమనిస్తే శక్తి సామార్ధ్యాలన్నింటిలో అల్లాహ్ ఒక్కడే అన్న విషయాన్నిగుర్తిస్తారు.ఆయన తన అవిధేయులను కఠినంగా శిక్షిస్తాడు.సాటి కల్పించేవారు ఒక వేళ వీటన్నింటిని చూస్తే వారు అతనితోపాటు ఇతరులను సాటి కల్పించరు.