అల్-ముఖ్తసర్
زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا۟ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ ۘ وَٱلَّذِينَ ٱتَّقَوْا۟ فَوْقَهُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ وَٱللَّهُ يَرْزُقُ مَن يَشَآءُ بِغَيْرِ حِسَابٍ ﴿٢١٢﴾
అల్లాహ్ ను తిరస్కరించే వారి కొరకు ఇహలోక జీవితము,అందులో ఉన్న ఆహ్లాదకరమైన విషయాలు,అంతమైపోయే రుచుల ద్వారా అందంగా అలంకరించబడింది.వారు అల్లాహ్ ను, అంతిమ దినమును విశ్వసంచే వారిని హేళన చేస్తున్నారు,అల్లాహ్ కు భయపడి ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడే వారు పరలోకములో ఈ అవిశ్వాసుల కన్న ఉన్నత స్థానంలో ఉంటారు.అల్లాహ్ వారందరిని కలకాలముండే స్వర్గ వనాల్లో ఉంచుతాడు,అల్లాహ్ తన సృష్టి లోంచి తలచుకున్న వారికి లెక్క లేనంత ప్రసాదిస్తాడు.