అల్-ముఖ్తసర్
يَسْـَٔلُونَكَ مَاذَا يُنفِقُونَ ۖ قُلْ مَآ أَنفَقْتُم مِّنْ خَيْرٍ فَلِلْوَٰلِدَيْنِ وَٱلْأَقْرَبِينَ وَٱلْيَتَـٰمَىٰ وَٱلْمَسَـٰكِينِ وَٱبْنِ ٱلسَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا۟ مِنْ خَيْرٍ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٌ ﴿٢١٥﴾
ఓ ప్రవక్త మీ సహచరులు తమ ఇతరాత్ర సంపద నుండి ఏమి ఖర్చు చేయాలని,వాటిని ఎక్కడ ఉంచాలని మిమ్మల్ని అడుగుతున్నారు.వారికి సమాధానమిస్తూ మీరు ఇలా పలకండి:మీరు ఏదైతే ఖర్చు చేస్తున్నారో అది ధర్మసమ్మతమైనది,శ్రేష్టమైనది.అయితే మీరు మీ తల్లిదండ్రుల కొరకు,మీ దగ్గరి బంధువుల కనీస అవసరాల కొరకు,పేదవారైన అనాధల కొరకు,ఎటువంటి సంపద లేని నిరుపేదల కొరకు,ప్రయాణం వలన తన కుటుంబం నుండి,తన దేశం నుండి దూరంగా ఉన్న ప్రయాణిికుని కొరకు ఖర్చు చేయాలి.ఓ విశ్వాసపరులారా మీరు చేసే సత్కార్యం తక్కువైన,ఎక్కువైన అల్లాహ్ కు దాని గురించి జ్ఞానముండును,అతని నుండి ఏ వస్తువు దాగి ఉండదు.అతడు దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.