×
البقرةఆయత్ 220

అల్-ముఖ్తసర్

فِى ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ ۗ وَيَسْـَٔلُونَكَ عَنِ ٱلْيَتَـٰمَىٰ ۖ قُلْ إِصْلَاحٌ لَّهُمْ خَيْرٌ ۖ وَإِن تُخَالِطُوهُمْ فَإِخْوَٰنُكُمْ ۚ وَٱللَّهُ يَعْلَمُ ٱلْمُفْسِدَ مِنَ ٱلْمُصْلِحِ ۚ وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَعْنَتَكُمْ ۚ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٌ ﴿٢٢٠﴾

ఇహ,పరలోకాల్లో మీకు లాభం చేకూర్చే వాటి గురించి యోచన చేయటం కొరకు ఈ ఆదేశాలు ధర్మబద్దం చేయబడినవి.ఓ ప్రవక్త మీ అనుచరులు అనాధల పట్ల బాధ్యత గురించి వారితో వ్యవహరించటంలో ఎలా ప్రవర్తించాలి,వారి సంపదను తమ సంపదతతో కలిపి ఖర్చు చేయటం,కలిపి ఇంటి వ్యవహారాల్లో ఖర్చు చేయవచ్చా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు.వారికే సమాధానమిస్తూ తెలియపరచండి:వారి డబ్బులో ఎలాంటి పరిహారం లేకుండా లేదా వారి సంపదలో సంపర్కం లేకుండా మీరు సంస్కరించడం కొరకు వారి పై మీకు ప్రాధాన్యత నివ్వటం మీ కొరకు అల్లాహ్ వద్ద ఎంతో మేలైనది,పుణ్యపరంగా ఎంతో ఉత్తమమైనది.వారి సంపద సంరక్షణ వలన వారి సంపదలో వారికి మేలు ఉన్నది.జీవన సామగ్రి విషయంలో,నివాస విషయంలో మరియు అటువంటి విషయాల్లో వారి సంపదను మీ సంపదలో కలుపుకుంటే అలా చేసినందుకు మీ పై ఎటువంటి దోషం లేదు.ఎందుకంటే వారు ధర్మపరంగా మీకు సోదరులు,సోదరులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు.వారిలో కొందరు కొందరి వ్యవహారాలపై ఆధారపడి ఉంటారు.అనాధలను పోషించే వారిలోంచి ఎవరు అనాధల సొమ్మును కలుపుకుని చెడు చేయదలుచుకున్నారో ఎవరు సంస్కరించదలుచుకున్నారో అల్లాహ్ కు తెలుసు.ఒక వేళ అతను అనాధల విషయంలో మీకు కష్టతరం చేయదలచుకుంటే కష్టం చేస్తాడు.కాని అతను వారితో వ్యవహరించటంలో మీ కొరకు మార్గమును సులభతరం చేశాడు.ఎందుకంటే ఆయన ధర్మం సులభతరమును వివరిస్తుంది.నిశ్చయంగా అల్లాహ్ ఆధిక్యత కలవాడు,ఆయన పై ఏ వస్తువు ఆధిక్యతను చూప లేదు.అల్లాహ్ తన షృష్టి విషయంలో,దాని నిర్వహణలో,దానిని శాసించడంలో వివేకవంతుడు.