అల్-ముఖ్తసర్
وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا عَرَّضْتُم بِهِۦ مِنْ خِطْبَةِ ٱلنِّسَآءِ أَوْ أَكْنَنتُمْ فِىٓ أَنفُسِكُمْ ۚ عَلِمَ ٱللَّهُ أَنَّكُمْ سَتَذْكُرُونَهُنَّ وَلَـٰكِن لَّا تُوَاعِدُوهُنَّ سِرًّا إِلَّآ أَن تَقُولُوا۟ قَوْلًا مَّعْرُوفًا ۚ وَلَا تَعْزِمُوا۟ عُقْدَةَ ٱلنِّكَاحِ حَتَّىٰ يَبْلُغَ ٱلْكِتَـٰبُ أَجَلَهُۥ ۚ وَٱعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ يَعْلَمُ مَا فِىٓ أَنفُسِكُمْ فَٱحْذَرُوهُ ۚ وَٱعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ غَفُورٌ حَلِيمٌ ﴿٢٣٥﴾
వితంతువు లేదా మూడు సార్లు విడాకులు పొందిన స్త్రీ కి ఇద్దత్ కాలంలో నికాహ్ కోరికను సూచన ప్రాయంగా ప్రకటించకుండా తెలపటంలో ఎటువంటి దోషం లేదు,ఉదాహరణకి మీరు ఇలా పలకటం :నీ ఇద్దత్ పూర్తయిన తరువాత నాకు తెలియపరచు.ఇద్దత్ గడుపుతున్న స్త్రీ తో ఇద్దత్ పూర్తయిన తరువాత నికాహ్ చేసుకునే కోరికను మీ మనసుల్లో దాచి ఉంచటం వలన మీ పై ఎటువంటి దోషం లేదు.వారి విషయంలో మీ యొక్క కోరిక ఎక్కువగా ఉండటం వలన మీరు వారికి తొందరలోనే తెలియ పరుస్తారని అల్లాహ్ కు తెలుసు,అందుకనే ప్రకటించకుండా సూచన ప్రాయంగా తెలపటంను ఆయన మీ కొరకు సమ్మతించాడు.వారితో వివాహం గురించి వారు ఇద్దత్లో ఉన్నప్పుడు రహస్యంగా వారితో ఒట్టు వేయించుకోవటం నుండి జాగ్రత్త పడండి.కాని మంచిని ఉద్దేశించి మాటలైతే సరి,అవి కూడా బహిర్గతంగా ఉండాలి.ఇద్దత్ కాలంలో నికాహ్ ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి.మీ అంతర్యాల్లో దాచిన విషయాలను సయితం అల్లాహ్ తెలుసుకుంటాడని గుర్తుంచుకోండి.వాటిలో నుంచి మీ కొరకు సమ్మతించినవి మరియు మీ పై నిషేదించినవి ఉండవచ్చు,మీరు వాటి విషయంలో జాగ్రత్తపడండి.ఆయన ఆదేశమును వ్యతిరేకించకండి.మరియు నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి క్షమాపణ కోరే వారిని క్షమిస్తాడన్న విషయాన్ని,అతడు మృధు స్వభావి శిక్షించటంలో తొందర పడడని గుర్తుంచుకోండి.