అల్-ముఖ్తసర్
لَآ إِكْرَاهَ فِى ٱلدِّينِ ۖ قَد تَّبَيَّنَ ٱلرُّشْدُ مِنَ ٱلْغَىِّ ۚ فَمَن يَكْفُرْ بِٱلطَّـٰغُوتِ وَيُؤْمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسْتَمْسَكَ بِٱلْعُرْوَةِ ٱلْوُثْقَىٰ لَا ٱنفِصَامَ لَهَا ۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴿٢٥٦﴾
ఇస్లాం ధర్మం స్వీకరించమని ఎవ్వరినీ బలవంతం చేయరాదు. ఎందుకంటే ఇది స్పష్టంగా నిజమైన ధర్మం, దీనిని విశ్వసించమని ఎవరినీ బలవంతం చేయవలసిన అవసరం లేదు. అసత్యం నుండి సత్యం స్పష్టమై నిలుస్తుంది. ఎవరైతే అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ కు సాటిగా ఆరాధించబడే వాటన్నింటినీ తిరస్కరిస్తారో మరియు స్వయంగా వాటిని త్యజిస్తారో; మరియు అల్లాహ్ పై మాత్రమే విశ్వాసం కలిగి ఉంటారో, అలాంటి వారు పునరుత్థాన రోజున మోక్షానికి చేర్చే బలమైన త్రాడును పట్టుకుని ఉన్నారు మరియు ఆ త్రాడు ఎన్నటికీ తెగదు. అల్లాహ్ తన దాసుల వాంగ్మూలాలకు సాక్ష్యమిస్తాడు, ఆయనకు వారి చర్యలు తెలుసు మరియు తదనుగుణంగా ఆయన వారికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.