×
البقرةఆయత్ 276

అల్-ముఖ్తసర్

يَمْحَقُ ٱللَّهُ ٱلرِّبَوٰا۟ وَيُرْبِى ٱلصَّدَقَـٰتِ ۗ وَٱللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ ﴿٢٧٦﴾

అల్లాహ్ వడ్డీని సమూలంగా నాశనం చేయడం ద్వారా లేదా దానిలో నుండి తన దీవెనలను తొలగించడం ద్వారా దానిని తుడిచి వేస్తాడు. అయితే, ఆయన దానధర్మాల ప్రతిఫలాన్ని పెంచుతాడు. ఆయన వారి దానధర్మాల ప్రతిఫలాన్ని పది రెట్ల నుండి ఏడు వందల రెట్లు లేదా అంతకంటే ఎక్కువ మోతాదుకు పెంచుతాడు మరియు తమ సంపదలో నుండి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసేవారిని ఆశీర్వదిస్తాడు. అల్లాహ్ నిషేధించిన వాటిని చట్టబద్ధమైనవిగా భావించే మరియు నిరంతరం పాపాలలో కొనసాగే మొండి, మూర్ఖపు అవిశ్వాసిని అల్లాహ్ అస్సలు ఇష్టపడడు.