×
البقرةఆయత్ 279

అల్-ముఖ్తసర్

فَإِن لَّمْ تَفْعَلُوا۟ فَأْذَنُوا۟ بِحَرْبٍ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَٰلِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ ﴿٢٧٩﴾

ఒక వేళ మీరు పవిత్రమైన అల్లాహ్ యొక్క చట్టాన్ని పాటించకపోతే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఒక వేళ మీరు పశ్చాత్తాపపడి, అల్లాహ్ వద్ద క్షమాపణ వేడుకుంటూ, వడ్డీని వదిలి వేస్తే, మీ మూలధనం నుండి అప్పుగా మీరు మొదట ఇచ్చిన అసలు మొత్తాన్ని మాత్రమే వాపసు తీసుకోండి. అయితే ఇలా చేయడంలో మీరు మొదట ఇచ్చిన అసలు మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోకూడదు, తద్వారా ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలి. ఇంకా, అసలు మొత్తం కంటే తక్కువ తీసుకోవడం ద్వారా మీకూ అన్యాయం జరగ కూడదు.