అల్-ముఖ్తసర్
لَّا يُحِبُّ ٱللَّهُ ٱلْجَهْرَ بِٱلسُّوٓءِ مِنَ ٱلْقَوْلِ إِلَّا مَن ظُلِمَ ۚ وَكَانَ ٱللَّهُ سَمِيعًا عَلِيمًا ﴿١٤٨﴾
చెడు మాటలను బహిరంగంగా పలకటమును అల్లాహ్ ఇష్టపడడు. కాని దాన్ని ద్వేషిస్తాడు మరియు దానిపై బెదిరిస్తాడు. కాని హింసించబడిన వాడు చెడును బహిరంగంగా పలకటం తనపై హింసకు పాల్పడిన వాడి గురించి ఫిర్యాదు చేయటం మరియు అతనిపై శాపనార్దాలు పెట్టటం (బద్దుఆ చేయటం),అతని మాటలులాగే మాట్లాడి అతనితో ప్రతీకారం తీసుకోవటం అతనికి సమ్మతమే. కాని హింసకు గురైన వాడు చెడు మాటలను బహిరంగపరచటం కన్న సహనం వహించటం ఎంతో ఉత్తమం. మరియు అల్లాహ్ మీ మాటలను వినేవాడును మరియు మీ ఉద్దేశాలను బాగా తెలిసినవాడును. కావున మీరు చెడు పలకటం లేదా దాన్ని ఉద్దేశించడంతో జాగ్రత్తపడండి.