×
النساءఆయత్ 152

అల్-ముఖ్తసర్

وَٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱللَّهِ وَرُسُلِهِۦ وَلَمْ يُفَرِّقُوا۟ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ أُو۟لَـٰٓئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا ﴿١٥٢﴾

మరియు ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి ఆయన ఏకత్వమును చాటి, ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించరో మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి అవిశ్వాసపరులు చేసినట్లు వారి మధ్య బేధ భావమును చూపకుండా వారందరిపై విశ్వాసమును కనబరుస్తారో వారందరికి అల్లాహ్ వారి విశ్వాసమునకు మరియు వారి సత్కర్మలకు ప్రతిఫలంగా గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.