×
النساءఆయత్ 157

అల్-ముఖ్తసర్

وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا ٱلْمَسِيحَ عِيسَى ٱبْنَ مَرْيَمَ رَسُولَ ٱللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَـٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ ٱلَّذِينَ ٱخْتَلَفُوا۟ فِيهِ لَفِى شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِۦ مِنْ عِلْمٍ إِلَّا ٱتِّبَاعَ ٱلظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًۢا ﴿١٥٧﴾

మరియు గర్వపడుతూ "నిశ్చయంగా మేము అల్లాహ్ ప్రవక్త అయిన మర్యమ్ కుమారుడగు మసీహ్ ఈసాను హతమార్చాము" అబద్దపు వారి మాట వలన మేము వారిని శపించాము. వారు వాదిస్తున్నట్లుగా వారు ఆయనను చంపనూ లేదు మరియు ఆయనకు శిలువా వేయలేదు. కాని వారు అల్లాహ్ ఈసా అలైహిస్సలాం రూపమును వేసిన ఒక వ్యక్తిని చంపి అతనికి వారు శిలువ వేశారు. చంపబడిన వ్యక్తి ఈసా అలైహిస్సలాం అని వారు భావించారు. ఆయనను చంపినట్లు వాదించిన యూదులు మరియు వారి మాటలను అంగీకరించిన క్రైస్తవులు ఇద్దరూ ఆయన విషయంలో గందరగోళంలో మరియు సందేహంలో ఉన్నారు. అయితే వారికి ఆయన గురించి ఎటువంటి జ్ఞానం లేదు. వారు మాత్రం ఊహను అనుసరిస్తున్నారు. మరియు నిశ్చయంగా ఊహ సత్యం విషయంలో ఏ విధంగా పనికిరాదు. ఖచ్చితంగా వారు ఈసా అలైహిస్సలాంను చంపనూ లేదు మరియు వారు శిలువ వేయలేదు.