అల్-ముఖ్తసర్
إِنَّآ أَوْحَيْنَآ إِلَيْكَ كَمَآ أَوْحَيْنَآ إِلَىٰ نُوحٍ وَٱلنَّبِيِّـۧنَ مِنۢ بَعْدِهِۦ ۚ وَأَوْحَيْنَآ إِلَىٰٓ إِبْرَٰهِيمَ وَإِسْمَـٰعِيلَ وَإِسْحَـٰقَ وَيَعْقُوبَ وَٱلْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَـٰرُونَ وَسُلَيْمَـٰنَ ۚ وَءَاتَيْنَا دَاوُۥدَ زَبُورًا ﴿١٦٣﴾
నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్త మీకన్న పూర్వ ప్రవక్తలపై అవతరిపజేసినట్లే మీపై దైవవాణిని అవతరింపజేశాము. అయితే మీరు ప్రవక్తల్లోంచి కొత్తవారు కాదు. నిశ్చయంగా మేము నూహ్ వైపునకు దైవవాణిని అవతరింపజేశాము. మరియు ఆయన తరువాత వచ్చిన దైవ ప్రవక్తలపై మేము దైవవాణిని అవతరింపజేశాము. మరియు ఇబ్రాహీంపై మరియు ఆయన ఇద్దరు కుమారులైన ఇస్మాయీల్,ఇస్హాఖ్ పై మరియు ఇస్హాఖ్ కుమారుడగు యాఖూబ్ పై మరియు ఆయన సంతతి పై (వారు యాఖూబ్ కుమారుల్లోంచి పన్నెండు మంది ఇస్రాయిల్ సంతతికి చెందిన తెగల్లోంచి అయిన దైవ ప్రవక్తలు) మేము దైవవాణిని అవతరింపజేశాము. మరియు మేము ఈసా,అయ్యూబ్,యూనుస్,హారూన్,సులైమాన్ ల వైపు దైవవాణిని అవతరింపజేశాము. మరియు మేము దావూద్ కు ఒక గ్రంధమును ప్రసాదించాము. అది జబూర్.