అల్-ముఖ్తసర్
لَّـٰكِنِ ٱللَّهُ يَشْهَدُ بِمَآ أَنزَلَ إِلَيْكَ ۖ أَنزَلَهُۥ بِعِلْمِهِۦ ۖ وَٱلْمَلَـٰٓئِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًا ﴿١٦٦﴾
ఒక వేళ యూదులు మిమ్మల్ని తిరస్కరించినా నిశ్చయంగా ఓ ప్రవక్తా అల్లాహ్ మీపై అవతరింపజేసిన ఖుర్ఆన్ సరైనదన్న దాని ద్వారా మిమ్మల్ని దృవీకరిస్తున్నాడు. ఆయన అందులో తాను కోరుకుని తాను ఇష్టపడిన వాటిని లేదా తాను ఇష్టపడక తాను నిరాకరించిన వాటిని దాసులకు తెలియపరచదలచిన తన జ్ఞానమును అందులో అవతరింపజేశాడు. మీరు తీసుకుని వచ్చిన దాని నిజాయితీ గురించి అల్లాహ్ సాక్ష్యంతో పాటు దైవదూతలు సాక్ష్యం పలుకుతారు. మరియు సాక్షిగా అల్లాహ్ చాలును. ఇతరుల సాక్ష్యమునకు ఆయన సాక్ష్యము సరిపోతుంది.