×
النساءఆయత్ 170

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدْ جَآءَكُمُ ٱلرَّسُولُ بِٱلْحَقِّ مِن رَّبِّكُمْ فَـَٔامِنُوا۟ خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا۟ فَإِنَّ لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا ﴿١٧٠﴾

ఓ మానవులారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి సన్మార్గమును మరియు సత్య ధర్మమును మీ వద్దకు తీసుకుని వచ్చారు. కాబట్టి మీరు ఆయన మీ వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించండి అది మీ కొరకు ఇహపరాలలో మేలగును. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిస్తే నిశ్చయంగా అల్లాహ్ మీ విశ్వాసము నుండి అక్కరలేనివాడు. మరియు మీ అవిశ్వాసం ఆయనకు నష్టం కలిగించదు.అకాశముల్లో ఉన్న వాటి రాజ్యాధికారము మరియు భూమిలో,ఆ రెండిటి మధ్య ఉన్న వాటి రాజ్యాధికారము ఆయనకే చెందుతుంది. మరియు సన్మార్గమునకు ఎవరు హక్కుదారుడో అల్లాహ్ కు బాగా తెలుసు కాబట్టి ఆయన అతని కొరకు దాన్ని సులభతరం చేస్తాడు. మరియు ఎవరు దానికి హక్కు దారుడు కాడో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అతడిని దాని నుండి అంధుడిగా చేసేస్తాడు. మరియు ఆయన తన మాటల్లో మరియు తన కార్యాల్లో మరియు తన ధర్మ శాసనాల్లో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.