×
النساءఆయత్ 24

అల్-ముఖ్తసర్

وَٱلْمُحْصَنَـٰتُ مِنَ ٱلنِّسَآءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَـٰنُكُمْ ۖ كِتَـٰبَ ٱللَّهِ عَلَيْكُمْ ۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَآءَ ذَٰلِكُمْ أَن تَبْتَغُوا۟ بِأَمْوَٰلِكُم مُّحْصِنِينَ غَيْرَ مُسَـٰفِحِينَ ۚ فَمَا ٱسْتَمْتَعْتُم بِهِۦ مِنْهُنَّ فَـَٔاتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا تَرَٰضَيْتُم بِهِۦ مِنۢ بَعْدِ ٱلْفَرِيضَةِ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا ﴿٢٤﴾

వివాహితులైన స్త్రీలతో వివాహం చేసుకోవటం మీపై నిషేధించబడినది.కాని అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటంలో మీకు బానిసురాలైన వారితో వారి ఋతుస్రావం నయం అయిన తరువాత వారితో లైంగిక సంపర్కం మీకు అనుమతించబడుతుంది. అల్లాహ్ దాన్ని మీపై అనివార్యం చేశాడు. అల్లాహ్ మీకు స్త్రీల్లోంచి కొందరిని మినహాయించి మీకు అనుమతించాడు. మీరు మీ సంపదల ద్వారా మీ స్వయమును రక్షించుకోవటానికి మరియు వాటిని హలాల్ పద్దతి ద్వారా పరిశుద్ధపరచటానికి వ్యభిచార ఉద్దేశముతో కాకుండా మీరు కోరటానికి. మీరు వారితో నికాహ్ ద్వారా ప్రయోజనం చెందితే అల్లాహ్ మీపై అనివార్యం చేసిన వారి మహర్ లను వారికి ఇవ్వండి. అనివార్యం చేయబడిన మహర్ నిర్దేశించిన తరువాత అందులో అధికం చేసే విషయంలో లేదా అందులో కొంత భాగమును మినహాయించే విషయంలో మీ పరస్పర అంగీకారం జరిగిన విషయంలో మీపై ఎటువంటి పాపం లేదు. నిశ్చయంగా అల్లాహ్ కు తన సృష్టితాల గరించి బాగా తెలుసు. వారిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తన పర్యాలోచనలో మరియు తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.