అల్-ముఖ్తసర్
يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ ٱلَّذِينَ مِن قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ ﴿٢٦﴾
పరిశుద్ధుడైన అల్లాహ్ ఈ ఆదేశములను మీకు ధర్మబద్ధం చేయటం ద్వారా తన ధర్మ సూత్రాలను,శాసనాలను మరియు ఇహపరాల్లో మీకు ప్రయోజనాలు ఉన్న వాటిని స్పష్టపరచదలచాడు. మరియు హలాల్,హరామ్ చేసే విషయంలో మీకన్న పూర్వ ప్రవక్తల మార్గము వైపునకు మరియు వారి ఉదారలక్షణాలు,వారి మంచి నడవడికల వైపునకు మీరు వారిని అనుసరించటానికి ఆయన మిమ్మల్ని మార్గదర్శకం చేయదలిచాడు. మరియు ఆయన మిమ్మల్ని తన అవిధేయత నుండి తన విధేయత వైపునకు తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. మరియు అల్లాహ్ కు తన దాసుల ప్రయోజనాలు దేనిలో ఉన్నవో బాగా తెలుసు. కాబట్టి ఆయన దానిని వారి కోసం శాసనం చేశాడు. తన ధర్మ శాసనంలో మరియు వారి వ్యవహారములను నడిపించటంలో వివేకవంతుడు.