అల్-ముఖ్తసర్
وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَٱبْعَثُوا۟ حَكَمًا مِّنْ أَهْلِهِۦ وَحَكَمًا مِّنْ أَهْلِهَآ إِن يُرِيدَآ إِصْلَـٰحًا يُوَفِّقِ ٱللَّهُ بَيْنَهُمَآ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا ﴿٣٥﴾
ఓ భార్యాభర్తల సంరక్షకులారా వారిద్దరి మధ్య విబేధము శతృత్వమునకు మరియు విడిపోవటానికి దారి తీస్తుందని మీకు భయం ఉంటే మీరు భర్త వైపు నుంచి ఒక న్యాయపూరితమైన వ్యక్తిని మరియు భార్య తరపు నుంచి ఒక న్యాయపూరితమైన వ్యక్తిని పంపించండి; వారిద్దరు వారిరువురి మధ్య విడిపోవటంలో లేదా కలిసి ఉండటంలో దేనిలో ప్రయోజనం ఉన్నదో దాని ద్వారా తీర్పునివ్వటానికి. మరియు కలిసి ఉండటమే చాలా ఇష్టమైనది మరియు చాలా మంచిది. ఒక వేళ తీర్పునిచ్చేవారిద్దరు దాన్నే నిర్ణయించుకుని దాని వైపు మంచి పద్దతిని అవలంబిస్తే అల్లాహ్ భర్యాభర్తల మధ్య బంధమును కలిపి వేస్తాడు. మరియు వారి మధ్య ఉన్న విబేధమును తొలగించివేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ పై దాసుల్లోంచి ఏది గోప్యంగా ఉండదు. మరియు వారు తమ హృదయములలో దాచే సున్నితమైన వాటి గురించి ఆయనకు బాగా తెలుసు.