×
النساءఆయత్ 43

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَقْرَبُوا۟ ٱلصَّلَوٰةَ وَأَنتُمْ سُكَـٰرَىٰ حَتَّىٰ تَعْلَمُوا۟ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِى سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا۟ ۚ وَإِن كُنتُم مَّرْضَىٰٓ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَآءَ أَحَدٌ مِّنكُم مِّنَ ٱلْغَآئِطِ أَوْ لَـٰمَسْتُمُ ٱلنِّسَآءَ فَلَمْ تَجِدُوا۟ مَآءً فَتَيَمَّمُوا۟ صَعِيدًا طَيِّبًا فَٱمْسَحُوا۟ بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا ﴿٤٣﴾

ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు మీ మత్తు వీడనంత వరకు మరియు మీరు పలికేది అర్ధం చేసుకోనంత వరకు మీరు మత్తులో ఉన్న స్థితిలో నమాజ్ చదవకండి. మరియు ఈ ఆదేశం మద్యం పూర్తిగా నిషేధించబడక మునుపటిది. మరియు మీరు జనాబత్ స్థితిలో (వీర్య స్ఖలనం అయి ఉన్న స్థితిలో) మీరు గుసుల్ చేయనంత వరకు నమాజ్ చదవకండి. మరియు ఆ స్థితిలో మస్జిదులో ప్రవేశించకండి కాని అందులో ఆగకుండా దాటిపోతూ వెళ్ళవచ్చు. ఒక వేళ మీరు అనారోగ్యానికి గురైతే అప్పుడు నీళ్ళను ఉపయోగించటం సాధ్యం కాకపోతే లేదా మీరు ప్రయాణంలో ఉంటే లేదా మీలో నుండి ఎవరైన మలమూత్ర విసర్జన చేసి ఉంటే లేదా మీరు భార్యలతో సంభోగం చేసి ఉంటే అప్పుడు మీకు నీరు లభించకపోతే మీరు పరిశుద్ధ మట్టి వైపుకు మరలండి. అప్పుడు మీరు దానితో మీ ముఖములపై మరియు మీ చేతులపై మసహ్ చేసుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వైఫల్యమును మన్నించేవాడు, మిమ్మల్ని క్షమించేవాడు.