×
النساءఆయత్ 66

అల్-ముఖ్తసర్

وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ ٱقْتُلُوٓا۟ أَنفُسَكُمْ أَوِ ٱخْرُجُوا۟ مِن دِيَـٰرِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا۟ مَا يُوعَظُونَ بِهِۦ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيتًا ﴿٦٦﴾

ఒక వేళ మేము వారిపై ఒకరినొకరు హతమార్చటమును లేదా వారి ఇండ్ల నుండి వైదొలగిపోవటమును అనివార్యం చేస్తే వారిలో నుండి చాలా కొద్ది మంది మా ఆదేశమును పాటించేవారు. అల్లాహ్ వారికి కష్టమైన దాని బాధ్యత ఇవ్వలేదు కనుక వారు అల్లాహ్ స్థుతులను పలకాలి. ఒక వేళ వారు తమకు బోధించబడిన అల్లాహ్ విధేయతను పాటించి ఉంటే అది విభేదించటం కన్నా మేలైనది. మరియు వారి విశ్వాసమును మరింత దృఢం చేసేది. మరియు మేము మా వద్ద నుండి వారికి గొప్ప ప్రతిఫలమును ఇస్తాము. మరియు మేము అల్లాహ్ వైపునకు మరియు ఆయన స్వర్గం వైపునకు చేరవేసే మార్గము వైపునకు వారికి భాగ్యమును కలిగించేవారము.