అల్-ముఖ్తసర్
صِرَٰطِ ٱللَّهِ ٱلَّذِى لَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ أَلَآ إِلَى ٱللَّهِ تَصِيرُ ٱلْأُمُورُ ﴿٥٣﴾
ఆ అల్లాహ్ మార్గము ఆకాశముల్లో ఉన్నవి మరియు భూమిలో ఉన్నవి సృష్టి పరంగా,అధికారము పరంగా,పర్యాలోచన పరంగా ఆయనకే చెందుతాయి. వ్యవహారములన్ని తమ విధి వ్రాతలో,పర్యాలోచనలో ఖచ్చితంగా ఒక్కడైన అల్లాహ్ వైపునకే మరలుతాయి.