×
المائدةఆయత్ 119

అల్-ముఖ్తసర్

قَالَ ٱللَّهُ هَـٰذَا يَوْمُ يَنفَعُ ٱلصَّـٰدِقِينَ صِدْقُهُمْ ۚ لَهُمْ جَنَّـٰتٌ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۚ رَّضِىَ ٱللَّهُ عَنْهُمْ وَرَضُوا۟ عَنْهُ ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ ﴿١١٩﴾

అల్లాహ్ ఈసా అలైహిస్సలాం తో ఇలా అంటాడు-: "ఈ రోజు సంకల్పాల్లో,ఆచరణల్లో,మాటల్లో సత్యవంతులైన వారికి వారి నిజాయితీ ప్రయోజనకరమవుతుంది".వారి కొరకు భవనాల క్రింద నుంచి,వృక్షాల క్రింద నుంచి సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలు కలవు.వాటిలో వారు ఎల్లప్పుడు ఉంటారు.మరణం వారికి సంభవించదు.అల్లాహ్ వారితో ప్రసన్నుడయ్యాడు.వారిపై ఎన్నడు ఆగ్రహం చెందడు.వారు తాము ఏవైతే అతని వద్ద శాస్వత అనుగ్రహాలు పొందారో వాటి కారణంగా అతనితో సంతుష్ఠ పడ్డారు.ఈ ప్రతిఫలము, వారి నుండి (అల్లాహ్) ప్రసన్నతే గొప్ప సాఫల్యము.ఎటువంటి సాఫల్యము దానికి సరితూగదు.