×
المائدةఆయత్ 18

అల్-ముఖ్తసర్

وَقَالَتِ ٱلْيَهُودُ وَٱلنَّصَـٰرَىٰ نَحْنُ أَبْنَـٰٓؤُا۟ ٱللَّهِ وَأَحِبَّـٰٓؤُهُۥ ۚ قُلْ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُم ۖ بَلْ أَنتُم بَشَرٌ مِّمَّنْ خَلَقَ ۚ يَغْفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُ ۚ وَلِلَّهِ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ وَإِلَيْهِ ٱلْمَصِيرُ ﴿١٨﴾

మరియు యూదుల్లోంచి, క్రైస్తవుల్లోంచి ప్రతి ఒక్కరు తాము అల్లాహ్ కుమారులని మరియు ఆయనకు ప్రియమైనవారమని వాదించారు. ఓ ప్రవక్త వారిని ఖండిస్తూ ఇలా పలకండి : ఎందుకని అల్లాహ్ మీరు పాల్పడిన పాపములకు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు ? మీరు వాదించినట్లు ఆయన ప్రియతములేనైతే ఆయన మిమ్మల్ని ఇహలోకంలో హతమర్చటం ద్వారా మరియు రూపం మార్చటం ద్వారా మరియు పరలోకంలో నరకాగ్ని ద్వారా శిక్షంచడు. ఎందుకంటే ఆయన తాను ఇష్టపడిన వారిని శిక్షించడు. కాని మీరు మానవులందరిలాగే మానవులు. వారిలో నుండి ఎవరు మంచి చేస్తారో వారికి స్వర్గమును ప్రతిఫలంగా ప్రసాదిస్తాడు. మరియు ఎవరు చెడు చేస్తారో వారిని నరకాగ్నితో శిక్షిస్తాడు. అల్లాహ్ తాను తలచుకున్న వారిని తన అనుగ్రహముతో మన్నించివేస్తాడు మరియు తాను తలచుకున్న వారిని తన న్యాయముతో శిక్షిస్తాడు. మరియు భూమ్యాకాశముల రాజ్యాధికారము మరియు వాటి మధ్య ఉన్న వాటి యొక్క రాజ్యాధికారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు మరలిపోవలసిన చోటు ఆయన ఒక్కడి వైపే ఉన్నది.