×
المائدةఆయత్ 71

అల్-ముఖ్తసర్

وَحَسِبُوٓا۟ أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا۟ وَصَمُّوا۟ ثُمَّ تَابَ ٱللَّهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا۟ وَصَمُّوا۟ كَثِيرٌ مِّنْهُمْ ۚ وَٱللَّهُ بَصِيرٌۢ بِمَا يَعْمَلُونَ ﴿٧١﴾

వారు తమ ప్రమాణాలను భంగపరచటం, నిబంధనలను కాలరాయడం, సత్యాన్ని తిరస్కరించటం, ప్రవక్తలను హతమార్చటం వారికి ఎటువంటి హాని తలపెట్టదని భావించారు. కాని వారు ఊహించని విదంగా వారిపై శిక్ష పడుతుంది. వారు సత్యాన్ని చూడలేని అంధులైపోయారు. దాని వైపునకు వారు దిశానిర్దేశం పొందలేరు. వారు దాన్ని స్వీకరించే ఉద్ధేశముతో వినకుండా చెవిటి వారైపోయారు. అల్లాహ్ తన తరుపు నుండి అనుగ్రహంగా వారి పశ్చాత్తాపమును స్వీకరించాడు. వారు దాని తరువాత సత్యం నుండి అంధులైపోయారు. దానిని వినడం నుండి చెవిటి వారైపోయారు. ఇలా వారిలో చాలా మందికి సంభవించింది. అల్లాహ్ వారి కర్మలన్నింటిని వీక్షిస్తున్నాడు. ఆయన నుండి ఏ వస్తువూ గోప్యంగా లేదు. తొందరలోనే దాని ప్రకారమే వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.