×
المائدةఆయత్ 77

అల్-ముఖ్తసర్

قُلْ يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لَا تَغْلُوا۟ فِى دِينِكُمْ غَيْرَ ٱلْحَقِّ وَلَا تَتَّبِعُوٓا۟ أَهْوَآءَ قَوْمٍ قَدْ ضَلُّوا۟ مِن قَبْلُ وَأَضَلُّوا۟ كَثِيرًا وَضَلُّوا۟ عَن سَوَآءِ ٱلسَّبِيلِ ﴿٧٧﴾

ఓ ప్రవక్తా, క్రైస్తవులకు తెలపండి, సత్యాన్ని అనుసరించటం గురించి మీకు ఆదేశించబడిన విషయంలో మీరు హద్దుమీరకండి. ఎవరిని గౌరవించమని మీకు ఆదేశించడం జరిగిందో వారిని గౌరవించటంలో అతిక్రమించకండి. ఉదాహరణకు ప్రవక్తల విషయంలో, మీరు మర్యం కుమారుడైన ఈసా విషయంలో చేసినట్లుగా, ప్రవక్తలకూ దైవత్వం ఉన్నదని మీరు విశ్వసించారు. కారణం, మార్గభ్రష్టులైన మీ పూర్వికులను మీరు అనుసరించటం. వారు చాలా మంది ప్రజలను మార్గభ్రష్టులు చేశారు మరియు వారు కూడా సత్యమార్గము నుండి తప్పి పోయారు.