అల్-ముఖ్తసర్
وَٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱللَّهِ وَرُسُلِهِۦٓ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلصِّدِّيقُونَ ۖ وَٱلشُّهَدَآءُ عِندَ رَبِّهِمْ لَهُمْ أَجْرُهُمْ وَنُورُهُمْ ۖ وَٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَآ أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلْجَحِيمِ ﴿١٩﴾
మరియు అల్లాహ్ ను విశ్వసించేవారు మరియు ఆయన ప్రవక్తలను వారి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా విశ్వసించేవారు వారందరు సత్యసంధులు మరియు తమ ప్రభువు వద్ద అమరవీరులు, వారికి వారి కొరకు తయారు చేయబడిన వారి ఆదరణీయమైన ప్రతిఫలం కలదు. మరియు వారి కొరకు ప్రళయదినమున వారి ముందు మరియు వారి కుడి వైపున పరిగెత్తే వారి వెలుగు ఉంటుంది. మరియు అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరచి,మన ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరిస్తారో వారందరు నరకవాసులు. ప్రళయదినమున వారు అందులో ప్రవేశిస్తారు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. దాని నుండి వారు బయటకు రారు.