×
الأنعامఆయత్ 130

అల్-ముఖ్తసర్

يَـٰمَعْشَرَ ٱلْجِنِّ وَٱلْإِنسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ ءَايَـٰتِى وَيُنذِرُونَكُمْ لِقَآءَ يَوْمِكُمْ هَـٰذَا ۚ قَالُوا۟ شَهِدْنَا عَلَىٰٓ أَنفُسِنَا ۖ وَغَرَّتْهُمُ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا وَشَهِدُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا۟ كَـٰفِرِينَ ﴿١٣٠﴾

మరియు మేము ప్రళయదినాన వారితో అంటాము : ఓ మానవుల,జిన్నాతుల వర్గీయులారా ఏమీ మీ వద్దకు మీ కోవకు చెందిన వారు మానవుల్లోంచి అయి ఉంటారు. అల్లాహ్ వారిపై అవతరింపజేసిన వాటిని మీకు చదివి వినిపిస్తారు. ప్రళయదినమైన మీ ఈ రోజును పొందటం గురించి వారు మిమ్మల్ని భయపెడుతారు వారు ప్రవక్తలుగా రాలేదా?. అప్పుడు వారు సమాధానమిస్తారు : ఎందుకు కాదు.మాకు వ్యతిరేకంగా ఈ రోజు స్వయంగా మేమే సాక్ష్యమిస్తాం ఎందుకంటే నీ ప్రవక్తలు మాకు సందేశాలను చేరవేశారు. మరియు మేము ఈ రోజును పొందటం గురించి అంగీకరించాము. కాని మేము నీ ప్రవక్తలను తిరస్కరించాము,ఈ రోజును పొందటం గురించి తిరస్కరించాము. ఈ ప్రాపంచిక జీవితం తనలో ఉన్న అలంకారాలు,అలంకరణలు,అంతమైపోయే అనుగ్రహాల ద్వారా వారిని మోసగించింది. వారందరు ఇహలోకంలో అల్లాహ్ ని,ఆయన ప్రవక్తలని తిరస్కరించే వారని తమకు వ్యతిరేకంగా స్వయంగా సాక్ష్యం పలుకుతారు. వారి ఈ సాక్ష్యము,విశ్వాసము దాని గడువు ముగియటం వలన వారికి లాభం చేకూర్చదు.