×
الأنعامఆయత్ 50

అల్-ముఖ్తసర్

قُل لَّآ أَقُولُ لَكُمْ عِندِى خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعْلَمُ ٱلْغَيْبَ وَلَآ أَقُولُ لَكُمْ إِنِّى مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَىَّ ۚ قُلْ هَلْ يَسْتَوِى ٱلْأَعْمَىٰ وَٱلْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ ﴿٥٠﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : నావద్ద అల్లాహ్ యొక్క ఆహారపు ఖజానాలు ఉన్నాయని వాటిలో నేను కోరుకున్న వాటిని వినియోగిస్తానని మీతో చెప్పటం లేదు,అల్లాహ్ నాకు దైవవాణి ద్వారా తెలియపరచనివి కాకుండా అగోచర విషయాల గురించి నాకు జ్ఞానం ఉన్నదని చెప్పటం లేదు,నేను దైవదూతల్లోంచి ఒక దూత అని మీతో చెప్పటం లేదు.కాని నేను అల్లాహ్ తరపు నుండి పంపించబడ్డ ఒక ప్రవక్తను.నాకు దైవవాణి ద్వారా తెలియపరచబడిన వాటిని మాత్రమే అనుసరిస్తాను.నేను నాతో జరగని దాని గురించి దావా చేయను.ఓ ప్రవక్తా వారితో తెలియపరచండి : సత్యాన్ని చూడటం నుండి అంధుడైన అవిశ్వాసపరుడు,సత్యాన్ని చూసి దానిని విశ్వసించిన విశ్వాసపరుడు ఇద్దరూ సమానులవుతారా?.ఓ ముష్రికులారా మీరు మీ బుద్దితో మీ చుట్టూ ఉన్న సూచనల్లో యోచన చేయరా.