అల్-ముఖ్తసర్
وَلَا تَطْرُدِ ٱلَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِٱلْغَدَوٰةِ وَٱلْعَشِىِّ يُرِيدُونَ وَجْهَهُۥ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِم مِّن شَىْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِم مِّن شَىْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ ٱلظَّـٰلِمِينَ ﴿٥٢﴾
ఓ ప్రవక్తా ఉదయము,సాయంత్రము అల్లాహ్ కొరకు ఫ్రత్యేకిస్తూ శాస్వత ఆరాధనలో ఉండే నిరుపేద ముస్లిములను మీ సమావేశము నుండి దూరం చేయకండి.ముష్రికుల్లోంచి గొప్పవారిని చేరదీయటానికి వారిని దూరం చేయకండి.ఈ పేదవారందరి లెక్క ఏది మీపై లేదు.వారందరి లెక్క వారి ప్రభువు వద్ద ఉన్నది.వారిపై మీ లెక్క ఏదీ లేదు.ఒకవేళ మీరు వారందరిని మీ సమావేశాల నుండి దూరం చేస్తే మీరు అల్లాహ్ హద్దుల నుండి మితిమీరిన వారైపోతారు.