అల్-ముఖ్తసర్
سَأَصْرِفُ عَنْ ءَايَـٰتِىَ ٱلَّذِينَ يَتَكَبَّرُونَ فِى ٱلْأَرْضِ بِغَيْرِ ٱلْحَقِّ وَإِن يَرَوْا۟ كُلَّ ءَايَةٍ لَّا يُؤْمِنُوا۟ بِهَا وَإِن يَرَوْا۟ سَبِيلَ ٱلرُّشْدِ لَا يَتَّخِذُوهُ سَبِيلًا وَإِن يَرَوْا۟ سَبِيلَ ٱلْغَىِّ يَتَّخِذُوهُ سَبِيلًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا وَكَانُوا۟ عَنْهَا غَـٰفِلِينَ ﴿١٤٦﴾
అల్లాహ్ దాసులపై,సత్యానికి వ్యతిరేకంగా దుర్మార్గం ద్వారా అహంకారమును ప్రదర్శించే వారిని జగతిలో నా సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకోవటం నుండి,నా గ్రంధ ఆయతులను అర్ధం చేసుకోవటం నుండి మరల్చివేస్తాను. ఒక వేళ వారు ప్రతి సూచనను చూసినా దాని పట్ల వారి అభ్యంతరం,దాని పట్ల వారి విముఖత వలన,అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల వారి వ్యతిరేకత వలన (ద్వేషం వలన) దాన్ని అంగీకరించరు. ఒక వేళ వారు అల్లాహ్ మన్నత వైపునకు తీసుకుని వెళ్లే సత్య మార్గమును చూసినా అందులో వారు నడవరు. అందులో వారికి ఆసక్తి కూడా ఉండదు. ఒక వేళ వారు అల్లాహ్ ఆగ్రహమునకు చేర్చే పెడ దారులను,అప మార్గములను చూస్తే అందులో వారు నడుస్తారు. అది ఏదైతే వారికి సంభవించినదో దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చినది సత్యము అని నిర్దేశించే అల్లాహ్ గొప్ప సూచనలను వారు తిరస్కరించటం వలన,అందులో వారు యోచన చేయటం నుండి అశ్రద్ధ వహించటం వలన వారికి సంభవించినది.