×
الأعرافఆయత్ 157

అల్-ముఖ్తసర్

ٱلَّذِينَ يَتَّبِعُونَ ٱلرَّسُولَ ٱلنَّبِىَّ ٱلْأُمِّىَّ ٱلَّذِى يَجِدُونَهُۥ مَكْتُوبًا عِندَهُمْ فِى ٱلتَّوْرَىٰةِ وَٱلْإِنجِيلِ يَأْمُرُهُم بِٱلْمَعْرُوفِ وَيَنْهَىٰهُمْ عَنِ ٱلْمُنكَرِ وَيُحِلُّ لَهُمُ ٱلطَّيِّبَـٰتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ ٱلْخَبَـٰٓئِثَ وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَٱلْأَغْلَـٰلَ ٱلَّتِى كَانَتْ عَلَيْهِمْ ۚ فَٱلَّذِينَ ءَامَنُوا۟ بِهِۦ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَٱتَّبَعُوا۟ ٱلنُّورَ ٱلَّذِىٓ أُنزِلَ مَعَهُۥٓ ۙ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ ﴿١٥٧﴾

ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తున్నారో ఆయన వ్రాయలేని,చదవలేని నిరక్షరాసి. ఆయనపై ఆయన ప్రభువు దైవ వాణిని మాత్రమే అవతరింప చేస్తాడు. ఆయన నామమును,ఆయన గుణాలను,ఆయనపై అవతరింపబడిన దానిని వారు మూసాపై అవతరింపబడిన తౌరాతులో,ఈసాపై అవతరింపబడిన ఇంజీలులో లిఖిత పూర్వకంగా పొందుతారు,దేని మంచి గురించినైతే,మేలు గురించినైతే తెలుస్తుందో దాని గురించే వారికి ఆదేశిస్తాడు. మంచి మనసుల్లో,స్వఛ్ఛమైన స్వభావముల్లో చెడుగా గర్తింపు ఉన్న వాటి నుండి వారిని వారిస్తాడు. అభిరుచులను ఎటువంటి నష్టం లేని తినే వస్తువుల్లోంచి,త్రాగే వస్తువుల్లోంచి,స్త్రీల్లోంచి వారి కొరకు అనుమతినిస్తున్నాడు. వాటిలోంచి అశుధ్దమైన వాటిని వారిపై నిషేధిస్తున్నాడు. వారిపై మోయబడిన కష్టమైన బాధలను తొలగిస్తాడు హత్య చేసిన వాడిని హతమార్చడం అనివార్యమవటం లాంటి ఆ హత్య కావాలని చేసిన,అనుకోకుండా చేసిన. అయితే ఎవరైతే ఇస్రాయీలు సంతతి వారిలో నుండి,ఇతరుల్లో నుండి ఆయనను విశ్వసిస్తారో,ఆయనను గౌరవిస్తారో,ఆయన పెద్దరికాన్ని తెలుపుతారో ఆయన్ని వ్యతిరేకించే సత్యతిరస్కారులకు వ్యతిరేకంగా ఆయనకు సహాయం చేస్తారో,సన్మార్గమును చూపే వెలుగుగా ఆయనపై అవతరింపబడిన ఖుర్ఆన్ ను అనుసరిస్తారో వారందరు తాము ఆశించిన వాటిని పొందుతూ తాము భయపడే దాని నుండి పరిరక్షింపబడి సాఫల్యం చెందుతారు.