×
الأعرافఆయత్ 176

అల్-ముఖ్తసర్

وَلَوْ شِئْنَا لَرَفَعْنَـٰهُ بِهَا وَلَـٰكِنَّهُۥٓ أَخْلَدَ إِلَى ٱلْأَرْضِ وَٱتَّبَعَ هَوَىٰهُ ۚ فَمَثَلُهُۥ كَمَثَلِ ٱلْكَلْبِ إِن تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَث ۚ ذَّٰلِكَ مَثَلُ ٱلْقَوْمِ ٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا ۚ فَٱقْصُصِ ٱلْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ ﴿١٧٦﴾

ఒక వేళ మేము ఈ ఆయతుల ద్వారా అతని లాభమును ఆశిస్తే అతను వాటిపై ఆచరించే సౌభాగ్యమును కలిగించి మేము అతనిని ఉన్నత స్థానాలకు చేర్చుతాము. అప్పుడు అతను ఇహపరాల్లో ఉన్నత స్థానమును పొందుతాడు. కాని అతను తన పరలోకము పై ఇహలోకమునకు ప్రాధాన్యతనిస్తూ ప్రాపంచిక కోరికల వైపు వాలిన వేళ అతను తన ఓటమికి కారణమయ్యే వాటిని ఎంచుకున్నాడు. మరియు తన మనస్సు కోరే అసత్యాలను అనుసరించాడు. ఇహలోకంపై అత్యాశ యొక్క తీవ్రతలో అతని ఉపమానము కుక్క ఉపమానము లాంటిది. అది అన్ని పరిస్థితుల్లో నాలుకను బయటకు తీసి రొప్పుతూ ఉంటుంది. ఒక వేళ అది కట్టివేయబడినా నాలుక బయటకు తీసి రొప్పుతుంది,తరిమేసినా రొప్పుతుంది. ఈ ప్రస్తావించబడిన ఉపమానము మా ఆయతులను తిరస్కరించటం వలన మార్గభ్రష్టులైన జాతి వారి ఉపమానము. అయితే ఓ ప్రవక్తా మీరు వారు యోచన చేసి వారు ఉన్న తిరస్కారము,మార్గభ్రష్టతను విడనాడుతారని ఆశిస్తూ వారికి ఈ గాధలను వినిపిస్తూ ఉండండి.