అల్-ముఖ్తసర్
يَسْـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرْسَىٰهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ رَبِّى ۖ لَا يُجَلِّيهَا لِوَقْتِهَآ إِلَّا هُوَ ۚ ثَقُلَتْ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ لَا تَأْتِيكُمْ إِلَّا بَغْتَةً ۗ يَسْـَٔلُونَكَ كَأَنَّكَ حَفِىٌّ عَنْهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ ٱللَّهِ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ ﴿١٨٧﴾
మొరోటోళ్ళు అయిన సత్యతిరస్కారులు ప్రళయం గురించి అది ఎప్పుడు వస్తుంది,దాని గురించి జ్ఞానము ఎప్పుడు స్థిరపడును ? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఓ ముహమ్మద్ మీరు ఇలా సమాధానమివ్వండి : దాని జ్ఞానము నాకు లేదు,ఇతరులకు లేదు. దాని జ్ఞానము కేవలం ఒక్కడైన అల్లాహ్ కు ఉన్నది. దాని కోసం నిర్ధారించిన వేళ అల్లాహ్ తప్ప ఇంకెవరికి బహిర్గతం అవలేదు. దాని బహిర్గతమయ్యే విషయం ఆకాశ వాసులు,భూ వాసుల పై గోప్యము. అది మీ వద్దకు అకస్మాత్తుగా మాత్రం వస్తుంది. ప్రళయ జ్ఞానం గురించి మీరు అత్యాశ చూపిస్తున్నట్లు వారు మిమ్మల్ని ప్రళయం గురించి ప్రశ్నిస్తున్నారు. మీ ప్రభువు గురించి మీకు పరిపూర్ణ జ్ఞానం ఉండటం వలన దాని గురించి మీరు అడగటం లేదన్న విషయం వారికి తెలియదు. ఓ ముహమ్మద్ ప్రళయం గురించి జ్ఞానము కేవలం ఒక్కడైన అల్లాహ్ వద్దే ఉన్నదని,కాని చాలా మందికి దాని గురించి తెలియదని వారికి తెలియపరచండి.