×
الأعرافఆయత్ 195

అల్-ముఖ్తసర్

أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَآ ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَآ ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَآ ۖ أَمْ لَهُمْ ءَاذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ٱدْعُوا۟ شُرَكَآءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونِ ﴿١٩٥﴾

మీ అవసరాల్లో శ్రమించటానికి మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న ఈ విగ్రహాలందరికి కాళ్ళు ఉన్నాయా ?. లేదా శక్తితో మీ నుండి గట్టిగా నెట్టడానికి (మీ నుండి తొలగించటానికి ) వారికి చేతులున్నాయా ?. లేదా మీ కంటికి కనబడని వాటిని చూసి మీ కొరకు వెలికి తీయటం కొరకు వారికి కళ్ళు ఉన్నాయా ?. లేదా మీ నుండి గోప్యంగా ఉన్న వాటిని విని వాటి జ్ఞానమును మీకు చేరవేయటానికి వారికి చెవులు ఉన్నాయా ?. ఒకవేళ అవన్ని వారికి లేక పోతే అవి ప్రయోజనాన్ని చేకూరుస్తాయని లేదా నష్టాన్ని దూరం చేస్తాయని ఆశిస్తూ మీరు ఎలా వాటిని ఆరాధిస్తారు. ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : మీరు ఎవరినైతే అల్లాహ్ కు సమానంగా చేసుకున్నారో వారిని పిలుచుకోండి. ఆ తరువాత మీరంత నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచించండి. మీరు నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.