×
الأعرافఆయత్ 44

అల్-ముఖ్తసర్

وَنَادَىٰٓ أَصْحَـٰبُ ٱلْجَنَّةِ أَصْحَـٰبَ ٱلنَّارِ أَن قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدتُّم مَّا وَعَدَ رَبُّكُمْ حَقًّا ۖ قَالُوا۟ نَعَمْ ۚ فَأَذَّنَ مُؤَذِّنٌۢ بَيْنَهُمْ أَن لَّعْنَةُ ٱللَّهِ عَلَى ٱلظَّـٰلِمِينَ ﴿٤٤﴾

మరియు స్వర్గములో ఉండే స్వర్గ వాసులు నరకములో ఉండే నరక వాసులను వారిద్దరిలోంచి ప్రతి ఒక్కరు తమ కొరకు తయారు చేయబడిన స్థావరంలో ప్రవేశించిన తరువాత పిలిచి ఇలా అంటారు : నిశ్చయంగా మాకు మాప్రభువు వాగ్ధానం చేసిన స్వర్గమును నిజంగా,సంపూర్ణంగా మేము పొందాము. అయితే మీరు కూడా ఓ సత్య తిరస్కారులారా మీకు అల్లాహ్ వగ్ధానం చేసిన నరకం నిజంగా,సంపూర్ణంగా మీరు పొందారా?. సత్య తిరస్కారులు సమాధానమిస్తూ ఇలా అంటారు : నిశ్చయంగా మాకు వాగ్ధానం చేయబడిన నరకమును మేము నిజంగా పొందాము. ఒక ప్రకటించేవాడు అర్దిస్తూ ఇలా ప్రకటిస్తాడు : అల్లాహ్ దుర్మార్గులను తన కారుణ్యము నుండి ధూత్కరించు గాక. వాస్తవానికి ఆయన కారుణ్య ద్వారములు వారి కొరకు తెరవబడి ఉండేవి. వారు ఇహలోక జీవితంలో వాటి నుండి ముఖము చాటేశారు (విముఖత చూపారు).