అల్-ముఖ్తసర్
وَبَيْنَهُمَا حِجَابٌ ۚ وَعَلَى ٱلْأَعْرَافِ رِجَالٌ يَعْرِفُونَ كُلًّۢا بِسِيمَىٰهُمْ ۚ وَنَادَوْا۟ أَصْحَـٰبَ ٱلْجَنَّةِ أَن سَلَـٰمٌ عَلَيْكُمْ ۚ لَمْ يَدْخُلُوهَا وَهُمْ يَطْمَعُونَ ﴿٤٦﴾
ఈ ఇరు వర్గాల మధ్య అంటే స్వర్గ వాసుల,నరకవాసుల మధ్య ఒక ఎత్తైన అడ్డు గోడ ఉంటుంది. దానిని ఆరాఫ్ అని పిలుస్తారు. ఈ ఎత్తైన అడ్డు గోడపై కొంత మంది ఉంటారు. వారి పుణ్యాలు,పాపాలు సమానంగా ఉంటాయి. మరియు వారు స్వర్గ వాసులను వారి చిహ్నాలైన ముఖములు తెల్లగా ఉండటం ద్వారా,నరక వాసులను వారి చిహ్నాలైన ముఖములు నల్లగా ఉండటం ద్వారా గుర్తు పడతారు. వీరందరు స్వర్గ వాసులను గౌరవంగా పిలుస్తూ ఇలా అంటారు : "అస్సలాము అలైకుమ్" (మీపై శాంతి కురియుగాక). మరియు స్వర్గ వాసులు ఇప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు (ఆరాఫ్ వారు). వారు అల్లాహ్ కారుణ్యం ద్వారా అందులో (స్వర్గంలో) ప్రవేశించాలని ఆశిస్తుంటారు.