అల్-ముఖ్తసర్
قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَـٰدِلُونَنِى فِىٓ أَسْمَآءٍ سَمَّيْتُمُوهَآ أَنتُمْ وَءَابَآؤُكُم مَّا نَزَّلَ ٱللَّهُ بِهَا مِن سُلْطَـٰنٍ ۚ فَٱنتَظِرُوٓا۟ إِنِّى مَعَكُم مِّنَ ٱلْمُنتَظِرِينَ ﴿٧١﴾
హూద్ అలైహిస్సలాం ఇలా అంటూ వారిని ఖండించారు : మీరు అల్లాహ్ యొక్క శిక్షను,ఆయన ఆగ్రహమును అనివార్యము చేసుకున్నారు. అది మీపై తప్పక వాటిల్లుతుంది. మీరు,మీ తాతముత్తాతలు దేవుళ్ళుగా పేర్లు పెట్టుకున్న విగ్రహాల గురించి నాతో తగువులాడుతున్నారా ? వాటికి ఎటువంటి వాస్తవికత లేదు. దేవుళ్ళుగా మీరు పూజిస్తున్న వాటి గురించి మీరు వాదించటానికి అల్లాహ్ ఎటువంటి వాదనను దింపలేదు. మీ కొరకు ఏ శిక్ష గురించి తొందరగా రావాలని కోరుకున్నారో దాని గురించి నిరీక్షించండి. మరియు నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తాను. అది వాటిల్లుతుంది.