×
الأعرافఆయత్ 74

అల్-ముఖ్తసర్

وَٱذْكُرُوٓا۟ إِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنۢ بَعْدِ عَادٍ وَبَوَّأَكُمْ فِى ٱلْأَرْضِ تَتَّخِذُونَ مِن سُهُولِهَا قُصُورًا وَتَنْحِتُونَ ٱلْجِبَالَ بُيُوتًا ۖ فَٱذْكُرُوٓا۟ ءَالَآءَ ٱللَّهِ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ ﴿٧٤﴾

ఆద్ జాతి వారికి మీరు వారసులుగా అయిన వేళ మీపై కలిగిన అల్లాహ్ అనుగ్రహమును గుర్తు చేసుకోండి. మరియు ఆయన మిమ్మల్ని భూమిలో దింపినాడు (నివాసం ఏర్పరచాడు) దాని ద్వారా మీరు ప్రయోజనం చెందుతున్నారు. మరియు మీరు కోరుకున్న వాటిని పొందుతున్నారు. ఇదంత ఆద్ జాతి వారు అవిశ్వాసం,తిరస్కరణలో వారి నిలకడ తరువాత వినాశనమునకు గురైన తరువాత అయ్యింది. భూ మైదానాల్లో మీరు భవనాలను నిర్మిస్తున్నారు. మీ కొరకు గృహాలను నిర్మించుకొనుటకు కొండలను తొలచి వేశారు. మీపై ఉన్న అనుగ్రహాలకు అల్లాహ్ ని కృతజ్ఞత తెలుపుకోవటం కొరకు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోండి. భూమిలో అల్లకల్లోలాను సృష్టించే ప్రయత్నాలు మానుకోండి. ఇది అల్లాహ్ పై అవిశ్వాసమును,పాపములను విడనాడటం ద్వారా జరుగును.