×
الأعرافఆయత్ 85

అల్-ముఖ్తసర్

وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۗ قَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥ ۖ قَدْ جَآءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ ۖ فَأَوْفُوا۟ ٱلْكَيْلَ وَٱلْمِيزَانَ وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تُفْسِدُوا۟ فِى ٱلْأَرْضِ بَعْدَ إِصْلَـٰحِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ﴿٨٥﴾

మరియు మేము మద్యన్ జాతి వారి వైపునకు వారి సోదరుడు షుఐబ్ అలైహిస్సలాం ను ప్రవక్తగా పంపించాము. ఆయన వారితో ఇలా అన్నారు : ఓ నా జాతి వారా మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి,మీ కొరకు ఆయన తప్ప వేరే ఆరాధనకు అర్హత కలిగిన ఆరాధ్యదైవం లేడు. నా ప్రభువు వద్ద నుండి మీ వద్దకు నేను తీసుకుని వచ్చినది నిజము అనటానికి అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన ఆధారము,స్పష్టమైన వాదన మీ వద్దకు వచ్చినది. మీరు పరిపూర్ణమైన కొలతలు,పరిపూర్ణమైన తూకముల ద్వారా ప్రజల యొక్క హక్కులను చెల్లించండి. ప్రజల వ్యాపార వస్తువుల్లో లోపం చూపించి,అందులో అల్పమును చూపించి లేదా వాటిని కలిగిన వారిని మోసం చేసి తగ్గించకండి. ముందు నుంచే ప్రవక్తలను పంపించి భూమిలో సంస్కరణ జరిగిన తరువాత అవిశ్వాసము,పాపములకు పాల్పడి అందులో చెడును సృష్టించకండి. ఒకవేళ మీరు విశ్వాసపరులే ఐతే అల్లాహ్ వారించిన పాప కార్యముల నుండి జాగ్రత్త పడుతూ విడనాడి,అల్లాహ్ ఆదేశించినవి వేటిలో నైతే అల్లాహ్ సామిప్యమున్నదో వాటిని పాటించటం వలన ఈ ప్రస్తావించబడినవి మీ కొరకు మేలైనవి,ఎంతో లాభదాయకమైనవి.