×
التوبةఆయత్ 3

అల్-ముఖ్తసర్

وَأَذَٰنٌ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلنَّاسِ يَوْمَ ٱلْحَجِّ ٱلْأَكْبَرِ أَنَّ ٱللَّهَ بَرِىٓءٌ مِّنَ ٱلْمُشْرِكِينَ ۙ وَرَسُولُهُۥ ۚ فَإِن تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَوَلَّيْتُمْ فَٱعْلَمُوٓا۟ أَنَّكُمْ غَيْرُ مُعْجِزِى ٱللَّهِ ۗ وَبَشِّرِ ٱلَّذِينَ كَفَرُوا۟ بِعَذَابٍ أَلِيمٍ ﴿٣﴾

సమస్త మానవాళికి నహర్ రోజున (ఖుర్బానీ రోజున) అల్లాహ్ తరపు నుండి ప్రకటన,ఆయన ప్రవక్త తరపు నుండి ప్రకటన "అల్లాహ్ సుబహానహు వ తఆలా (పరిశుద్ధుడైన,మహోన్నతుడైన) ముష్రికుల నుండి విసుగు చెందాడని,అలాగే ఆయన ప్రవక్త వారి నుండి విసుగు చెందారని".ఓ ముష్రికులారా ఒక వేళ మీరు మీ షిర్కు నుండి మన్నింపు కోరుకుంటే (పశ్చ్యాత్తాప్పడితే) మీ పశ్చ్యాత్తాపము మీకు మేలైనది.ఒక వేళ మీరు పశ్చాత్తాపము నుండి విముఖత చూపితే మీరు అల్లాహ్ నుండి తప్పించుకోలేరని,ఆయన శిక్ష నుండి మీరు విముక్తి పొందలేరని నమ్మకమును కలిగి ఉండండి.ఓ ప్రవక్తా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారికి వారిని బాధ కలిగించే దాని గురించి సమాచారమివ్వండి.అది బాధ కలిగించే శిక్ష,అది వారి కోసం నిరీక్షిస్తుంది.