అల్-ముఖ్తసర్
فَإِذَا ٱنسَلَخَ ٱلْأَشْهُرُ ٱلْحُرُمُ فَٱقْتُلُوا۟ ٱلْمُشْرِكِينَ حَيْثُ وَجَدتُّمُوهُمْ وَخُذُوهُمْ وَٱحْصُرُوهُمْ وَٱقْعُدُوا۟ لَهُمْ كُلَّ مَرْصَدٍ ۚ فَإِن تَابُوا۟ وَأَقَامُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتَوُا۟ ٱلزَّكَوٰةَ فَخَلُّوا۟ سَبِيلَهُمْ ۚ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ ﴿٥﴾
మీరు మీ శతృవులను శరణం కల్పించిన నాలుగు నిషిద్ధ మాసాలు ముగిసిపోయినప్పుడు వారు మీకు దొరికిన చోట వారిని వదించండి. మరియు వారిని వారి కోటల్లోనే నిర్బంధించండి. వారి దారుల్లో మీరు మాటు వేయండి. ఒక వేళ వారు షిర్క్ నుండి అల్లాహ్ తో పశ్చ్యాత్తాప్పడి,వారు నమాజును నెలకొల్పి,తమ సంపదల్లోంచి జకాతును చెల్లిస్తే వారు ఇస్లాం ధర్మ ప్రకారం మీ సోధరులైపోయారు. అలా అయితే మీరు వారితో యుద్ధమును వదిలివేయండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చ్యాత్తాప్పడే వాడిని మన్నించే వాడు,అతడిపై కరుణించే వాడు.